అగ్నిధారన్యూస్ (జగిత్యాలజిల్లా) పట్టణంలోని      టి ఆర్ నగర్ లో మద్యం సేవించ వద్దు. అని మందలించిన తల్లిని కొడుకు దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోషవ్వ అనే వృద్ధురాలు తన కొడుకు తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుండటంతో మద్యం సేవించ వద్ద ని మందలించింది. దీంతో తన తల్లి పై దాడి చేసి బలంగా నెట్టి వేయడం తో కిందపడి ఆపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రధాన ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని జగిత్యాల రూరల్ సిఐ కృష్ణ కుమార్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు..