కార్మికులు అంటే బానిసలు కాదు.
కార్మికులకు అండగా నేను ఉంటాను.
కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలి.
సమస్యను జటిలం చేస్తే నష్టం యాజమాన్యానికె.
వెలుగునింపే కార్మికుల జీవితాలలో,చీకట్లునింపుతారా
ఒప్పందాల నియమావళికి పాటిస్తున్నారా ?
ఉదయం 8 గంటల నుండి 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
అగ్నిధారన్యూస్ ( రామగుండం ): రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీలో పనిచేసే కార్మికుల సమస్యల పైన ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ” ఎన్టిపిసి లేబర్ గేట్ వద్ద జరగబోయే దీక్షా కార్యక్రమాన్ని తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు కాంట్రాక్టు కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మికులకు, సంఘీభావం తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. దేశానికి వెలుగు పంచుతున్న ఎన్టీపీసీ సంస్థ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకటి నింపుతుంది. సంస్థలో కార్మికుడు పని చేస్తేనే,ఎన్టీపీసీ విద్యుత్ రంగంలో విజయాలను సాధిస్తుంది. అలాంటి కార్మిక వర్గాన్ని యాజమాన్యం చిన్నచూపు చూస్తూ, చేసుకున్న ఒప్పందాలను అమలుకు నోచుకొనివ్వడం లేదు అన్నారు. ఫలితంగా కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి, గురవుతున్నారు అన్నారు.ఎన్టీపీసీ ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, కాంట్రాక్టు కార్మికుల పక్షాన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరాటం కొనసాగించడానికి ,ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఒప్పందాల అమలు కోసం శుక్రవారం రోజు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు. 2019లో ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో, పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రమోషన్ పాలసీ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ,ఉన్న కార్మికులకు టెక్నీషియన్, హోదా, వేతన సవరణ, అలవెన్సులు,వంటివాటిని అమలు చేస్తామని, యాజమాన్యం ఒప్పందంలో పేర్కొంది. కానీ ఏళ్ళు గడుస్తున్న ఎన్టీపీసీ యాజమాన్యం వాటిని అమలు చేయడంలో, చిత్తశుద్ధి చూపలేదు. దీంతో కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధన కోసం,ఒప్పందాలు అమలు పరచడం కోసం,
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముందుకు వచ్చారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ సంస్థ అయిన ఎన్టీపీసీ కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ, చేయడం,ఒప్పందాలు అమలు చేయకపోవడం ,ఎంత వరకు సమంజసం అని, ప్రశ్నిస్తున్నానన్నారు . వందలాది మంది కార్మికులు దయనీయ పరిస్థితుల్లోజీవనం కొన సాగిస్తున్నారు.ఒప్పందాలు అమలు జరిగితే కార్మికుల జీవితాలు మెరుగు పడతాయని ఎన్టీపీసీని యాజమాన్యాన్ని కోరుతున్నామన్నారు.సమస్యలు విన్నపించిన యాజమాన్యం మొండిగావ్యవహరిస్తుండటంతో కార్మిక వర్గంతో కలిసి సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నాను అన్నారు.
( FILE PHOTO )
