అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): గురువారం రోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం పెద్దపల్లి లోని సవేర ఆప్టికల్స్ లో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్,క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ పేర్కొన్నారు.ఈ రోజు 123 మందికి ఉచిత కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా నిర్వహించామని,కంటిలో శుక్లాలు ఉన్నవారికి పూర్వ గవర్నర్ లయన్ చిదుర సురేష్ సహకారంతో రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచిత రవాణా భోజన వసతులతో కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని,అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దత్తాగౌడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో నేత్రవైద్య సహాయకులు లయన్ భూతగడ్డ చందు పాల్గొన్నారు.
