అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
TPTF పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్.
అగ్నిధార న్యూస్( కరీంనగర్ ): హైదరాాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్వహిస్తున్న మహాధర్నాకు వెళ్లకుండా అనేక మంది ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి తీవ్రంగా ఖడిస్తున్నామన్నారు.317 జి .ఓ సవరణ చేసి అన్యాయం జరిగిన వారికి, సినియారిటి కోల్పోయిన వారికి, అప్పీల్ చేసుకున్న వారికి, స్థానికులకు, వితంతువులకు, భార్యాభర్తలకు అందరికీ న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోల్పోయి పరాయి జిల్లాలో బతకాల్సిన దుస్థితి రావడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం పంతానికి పోయి ఇంతటి నిర్బంధం విధించడం గతంలో ఎన్నడూ జరగలేదు అన్నారు. ఇది అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వం అనుకుంటే సమస్యను పరిష్కరించడం చాలా సులువు, కానీ పంతానికి పోవడం సరైంది కాదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చకు రావాలి అని సూచించారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలి.అని TPTF నాయకులు ,అరుకాల శ్రీనివాస్ లు ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు.
