బ్లాక్ స్పాట్ లలో ప్రమాదాల నివారణ కై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు.
అగ్నిధారన్యూస్( రామగుండం ): రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్ద పల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో గుర్తించి అట్టి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను పర్యవేక్షించి వాహనాల అతివేగం వలన మాత్రమే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కోసం హెచ్ ఆర్ కె వారి సహకారంతో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన రహదారి వెంట ఉన్న పెద్ద పెద్ద యాడ్ ఓడింగ్స్ తొలగించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపెల్లి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ట్రాఫిక్ ఎస్ఐ దత్తు ప్రసాద్ లు Rumble stripsఏర్పాటు మరియు యాడ్ ఓడింగ్స్ తొలగింపు చేయించడం జరిగింది.
