అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ): పెద్దపల్లి        జిల్లా పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో, సోమవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ,మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపూర్ పంచాయతీ కార్యదర్శి ,గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రోజు మృతి చెందారు. మృతి చెందిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి మండల అభివృద్ధి అధికారి రాజుతో కలిసి నివాళులర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ,తోటి మిత్రులైన పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 37 మంది వరకు వృత్తిపరంగా వ్యక్తిగతంగా చనిపోవడం దురదృష్టకరమన్నారు. అటు వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా, ఆత్మహత్యలు చేసుకోవడం సరైనది కాదన్నారు. సమస్య ఉన్నప్పుడు ఉన్నత అధికారులతో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం సబబు కాదన్నారు. వృత్తిపరంగా పంచాయతీ కార్యదర్శులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా   ముందుకు సాగాలని అన్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల విచక్షణ కోల్పోయి కుటుంబాలు.రోడ్డుపాలు అవుతాయన్నారు. వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఐక్యంగా పోరాడుదామన్నారు. గ్రామ పంచాయతీలలో వృత్తి రీత్యా సమస్యలు ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించాలి తప్ప, మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యం అనుకోవడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వంతో ఐక్యంగా సంప్రదింపులు జరిపి సాధించుకుందాం అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అంజాద్ పాషా, సంతోష్, హరి, అంకం రవి, సురేష్, పాపయ్య, అంజలి, మహేష్, వెంకన్న, ప్రమోద్, సతీష్, శంకర్, సంతోష్ రెడ్డి, సౌజన్య, మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.