చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ సత్యం
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):చిన్న చిన్న గదులు చీకటి రూములు అని అంగన్వాడీ కేంద్రాలలో నెలకొన్న అనేక సమస్యల పైన ఈనెల 5న అగ్నిధార లో ప్రచురితమైన వార్తకు స్పందనగా సోమవారం రోజు పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో ఉన్న సమస్యల్ని నిశితంగా పరిశీలించి అప్పటికప్పుడే, గ్రామ సర్పంచ్ శిలారపు సత్యం సమస్యను గుర్తించి,సంబంధిత హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆగయ్య ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కిషన్ రెడ్డితో చర్చించి ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్ర నిర్వహణ కోసం ఒక గదిని కేటాయించాల్సిందిగా సూచించారు . అందుకు ప్రధానోపాధ్యాయులు సమ్మతం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యం మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పాలకవర్గం అధికారుల సహాయ సహకారాలతో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి తనవంతుగా కృషి చేస్తున్నాను అన్నారు అదేవిధంగా సంబంధిత శాఖ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం నుండి కానీ అంగనివాడి భవనానికి నిధులు కేటాయించినట్లు అయితే భవనానికి కావలసిన స్థలాన్ని సమకూరుస్తామని అగ్నిధార ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందితో పాటు పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
