రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇద్దరికి గాయాలు.       

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన పెద్దపల్లి పట్టణ శివారులోనీ నిట్టూరు రోడ్ లో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిట్టూరులోని మారుతి రైస్ మిల్ లో పనిచేస్తున్న బిహారీ కూలీలు సునీల్, గణపతి లు ద్విచక్ర వాహనంపై నిట్టురు కు వెళుతుండగా ఎలిగేడు మండలం లాలపల్లికి చెందిన పెద్దపల్లి మున్సిపల్ వర్కర్ వడ్లురి రవీందర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వలసకూలీ సునీల్ మృతి చెందగా ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న గణపతితో పాటు రవీందర్ గాయపడ్డారు. క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.