అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా అధికారి కార్యాలయంలో ,తెలంగాణ హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్కడైరీని, మరియు గోడ పత్రికను డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమంలలో హెల్త్ ఎడ్యుకేటర్ మరియు మీడియా సెక్షన్ పాత్రను కొనియాడారు. సమ్మక్క సారలమ్మ జాతర, వివాహాలు మరియు ఇతర వేడుకలలో అందరూ తప్పకుండా మాస్కు వాడుతూ సామాజిక దూరం పాటిస్తూ చేతులు సానిటైజేషన్ చేసుకుంటూ కోడి నిబంధనలు పాటిస్తూ కోవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అందుకు అందుకు ఆరోగ్యశాఖ పైన బృహత్తరమైన కార్యక్రమం ఉందన్నారు ముఖ్యంగా హెల్త్ హెడ్యుకేటర్స్ సమాజంలో అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటేశ్వర్లు డిప్యూటీ,మధుసూదన్ హెల్త్ ఎడ్యుకేటర్,రాజేశ్వరి హెల్త్ ఎడ్యుకేటర్,రాజేశం ఎంపి హెచ్ ఈవో, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
