మీర్జాజంపేట లో ముస్తాబైన సమ్మక్క సారక్క గద్దెలు
అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని మీర్జాజం పేట గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం గా గుర్తింపు పొందింది. అందుకు అనుగుణంగా జాతర కమిటీ సభ్యులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు ముస్తాబు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ పుప్పాల నాగార్జున రావు తో పాటు జాతర కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం జాతర సమీపిస్తున్న దృశ్య పనుల వేగవంతం చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ జాతరకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని జాతర కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. జాతర తీరప్రాంతంలో మానేరు నది ఉండడంతో తాగునీరు, స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ జాతర వారం రోజులు ఉన్న సందర్భంగా ఇప్పటికే పలు దుకాణాలు వెలిశాయి. కాల్వశ్రీరాంపూర్,తారు పల్లి మీదుగా మీర్జాజంపేట కు వెళ్లేందుకు దారి సరిగా లేక పోవడం తో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఏమో? మొట్లపల్లి, కిష్టంపేట మీదుగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా తారుపల్లి, మీర్జాంపేట గ్రామాల మధ్య గల రహదారి తారు రోడ్డు వెయ్యాలని భక్తులు అగ్నిధార న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
