అగ్నిధారన్యూస్( గోదావరిఖని ):శుక్రవారం రాత్రి గోదావరిఖని లక్ష్మీ నగర్ బోళ్ల వీధి లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతయిన పల్లవి లేడీస్ ఎంపోరియంను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శనివారం రాత్రి సందర్శించారు. బాధితుడు కూకట్ల శ్రీనివాస్ ను ప్రమాదానికి దారితీసిన కారణాలను, జరిగిన ఆస్తి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన వ్యాపారస్తులతో మాట్లాడుతూ అధిక మొత్తంలో ఆస్తి నష్టపోయిన బాధితుడు శ్రీనివాస్ ను లక్ష్మీ నగర్ వ్యాపారులంతా కలిసి ఆదుకోవాలని కోరారు. వ్యాపారులు తమ షాపులకు విధిగా ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. అందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు స్థానిక వ్యాపారులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు గన్ముకుల తిరుపతి, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, రాజ్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, వ్యాపారస్తులు బంక రామస్వామి, గోలి రమణారెడ్డి, ముడుతనపల్లి సారయ్య,సత్యం తదితరులున్నారు.
