వివరాలు వెల్లడిస్తున్న ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం,సమ్మక్క,సారలమ్మ జాతర ప్రసాదంను మీ సేవ కేంద్రాల  ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని, ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత తెలిపారు. భక్త్తులు తమకు సమీపంలోని మీ సేవా కేంద్రాలలో  225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే 225 రూపాయలలో ప్రసాదం ధర 190 రూపాయలు కాగా, సేవా రుసుము కింద 35 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.