హైదరాబాదులో కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా
అగ్నిధారన్యూస్( మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి, ఈరోజు జరుగుతున్న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు,రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా, వీఆర్ఏలు వేకువ జామునే బయలు దేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో గల వీఆర్ఏ ల హక్కుల సాధన కోసం ఒకరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వి ఆర్ ఏ లు హైదరాబాద్ కు తరిలారు.

