అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఎస్సై మానస ఆధ్వర్యంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని, సూచించారు.తల్లిదండ్రులు పిల్లల నడవడిక పై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
