అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా  కేంద్రంలో బంధంపల్లి లోని స్వరూప గార్డెన్లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఒక్కసారిగా ఫ్లెక్సీ రగడ ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించింది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఫోటో ఫ్లెక్సీ పైన చిన్నగా ముద్రించారు, అని  గమనించిన భాను ప్రసాద్ రావు వర్గీయులు పడాల స్వామి గౌడ్, మరికొందరు అక్కడ చేరిన నాయకులతో వాగ్వాదానికి దిగారు. భాను ప్రసాద్ రావు, కల్పించుకొని సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది.