SC యువతి యువకులకు ఉచిత ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాం.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి తెలంగాణ షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ ద్వార పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ SC యువతకు స్థిరమైన ఆదాయమును కల్పించడం కోసం RISE – రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్ మెంట్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ను ఎంపిక చేయబడినది శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ మల్లేశం తెలిపారు. మరియు జిల్లాలోని నిరుద్యోగ SC యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాల క్రింద శిక్షణ ఇవ్వడం కోసం RISE ఇన్స్టిట్యూట్,పాత ఎల్ఐసి భవనం ,ప్రగతినగర్, పెద్దపల్లి లో స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం క్రింద లింక్ చేయబడిన ప్లేస్ మెంట్ తో ఈ క్రింది కోర్సులలో 3 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వటానికి నిర్ణయించబడినందున నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
1.ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్
(రిసెప్షనిస్ట్ ) ఇంటర్/డిగ్రీ పాస్
2 .జనరల్ డ్యూటి అసిస్టెంట్ (నర్సింగ్ ట్రైనింగ్) ఇంటర్ పాస్
కావున జిల్లాలోని 18 నుండి 35 సo.గల SC నిరుద్యోగ యువతీ యువకులు తామ దరఖాస్తు ఫారములను ఈ క్రింద వ్రాయబడిన ధృవీకరణ పత్రములతో తేది 10-03-2022* లోగా ఈ కార్యాలయము నందు అందజేసి రసీదు పొందగలరు.
1)కులము సర్టిఫికేట్ 2) ఆదాయము సర్టిఫికేట్ (లేటెస్ట్) 3) నివాసము సర్టిఫికేట్, 4)రేషను కార్డు, 5)ఆదార్ కార్డు
6) స్టడీ సర్టిఫికేట్లు….దరఖాస్తులు ఇవ్వవలసిన చిరునామా:
RISE ఇన్స్టిట్యూట్,పాత ఎల్ఐసి భవనం,ప్రగతినగర్, పెద్దపల్లి.
సెల్:9440642832
8790136925
