అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):లైన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో, నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ అఫ్ తెలంగాణా ఐ కేర్ డైరెక్టర్ మరియు సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ లయన్ అబ్దుల్ వసీ మహమ్మద్ ఘనంగా నిర్వహించారు. స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. నేటి సమాజంలో అందివచ్చిన అవకాశాలను స్త్రీ, పురుషులు, అనే తారతమ్యం లేకుండా ఎంతో మంది స్త్రీలు ఉన్నత శిఖరాలను, అవరోధ ఇస్తున్నారు అన్నారు, స్త్రీ లేని సృష్టిని ఊహించుకోలేం అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, రకరకాల పాత్రలు పోషిస్తూ సమాజoలో స్త్రీ గొప్పతనం కనబరుస్తున్నారు అన్నారు. లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి శ్రీ శక్తి అధ్యక్షురాలు విజయగిరి సుధని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
