MY FAMILY VOLGS  యూట్యూబ్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు
నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వార్డులో

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల  ):  మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు మాట్లాడుతూ….. నిర్వాహకుల మహిళలు అంటే తమ సహోదరీలతో సమానమైన గౌరవం.మహిళలను ఈ ఒక్క రోజే కాదు,ప్రతిరోజు గౌరవించుకోవాలని ,మహిళలకు పురుషులతో ,సమానంగా అన్ని రంగాల్లో సమాన హక్కు కల్పించాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మా ఛానల్ “ఆధ్వర్యంలో ఈ సంబరాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎక్కడ స్త్రీ గౌరవింపబడతుందో, అక్కడ దేవతలు నివాసం ఉంటారు అన్నారు.కాబట్టి స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన మాకు సహకరించిన,*అగ్నిధారన్యూస్* యాజమాన్యానికి,  రిపోర్టర్ జీవన్ కు ప్రత్యేకంగా గా ధన్యవాదాలు తెలుపుతూ అతి తక్కువ కాలంలోనే  ప్రజాదరణ పొందుతున్న పత్రిక అగ్నిధార అన్నారు.
ఈ కార్యక్రమంలో, MY FAMILY VOLGS ఛానల్ యాజమాన్యం తలారి తిరుపతి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.