కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు  తెలిపిన తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసన్న, తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్ ముందుగా కేకు కట్ చేసి, మహిళా సోదరిమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజమందు మహిళా యొక్క అవశ్యాకత, వారి హక్కులు గూర్చి వక్తలు మాట్లాడo జరిగినది. స్త్రీ యొక్క శక్తిని, ఔనత్యాన్ని, గొప్పతన్నాని కొనియాడారు. తదనంతరం క్రీడలో గెలుపొందిన మహిళామణులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ హరి రామ్, స్వాతి,  స్వామి కండె రవీందర్, మధుకర్, ప్రేమ, రజిత, శ్రీ వాణి, పద్మ,, ప్రతిభ ప్రశాంతి రాణి పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.