అగ్నిధారన్యూస్ (  కమాన్ పూర్  ):కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ వరల్డ్ వన్ పిపు ల్ ఆర్గనైజర్ రణవేని లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిల దినోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి గాండ్ల మోహన్ హాజరయ్యారు. ఆయన చేతులమీదుగా మహిళ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.ముక్యంగా భారత మహిళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాల్యాల తిరుపతి.ఎం.పి.టీ. సి. సభ్యుడు బోనాల వెంకట స్వామి.అజిత్ రావు తదితరులు పాల్గోన్నారు.