అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల ప్రకటన హర్షం వ్యక్తం చేసిన- జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.

జిల్లా పరిషత్ లో సంబరాలు ,స్వీట్ల పంపిణీ

బాణాసంచా కాల్చి, సంతోషం వ్యక్తం చేసిన జెడ్పి చైర్ పర్సన్.

రెండు కోట్ల ఉద్యోగాలు ఎటు పోయాయో, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

అగ్నిధారన్యూస్ ( జగిత్యాలజిల్లా ):బుధవారం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్  అసెంబ్లీ వేదికగా 91,142 ఉద్యోగ నియామకాలు ప్రకటించగా, దాంట్లో జగిత్యాల జిల్లాకు 1,063 కొత్త ఉద్యోగాలు భర్తీ కానున్న సందర్భంగా,  మరియు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందించిన సందర్భంలో  జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ జిల్లా పరిషత్ సభ్యులతో , కలిసి ముఖ్యమంత్రి  చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి, సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా  జెడ్ పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్   మాట్లాడుతూ…….

నిరుద్యోగ యువతీ,యువకులకు అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్ ,చిత్ర పటానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో  పాలాభిషేకం చేయడం జరిగింది అన్నారు.తెలంగాణ చిత్రపటాన్ని దేశంలో గర్వంగా చాటిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.

బాణసంచా కాలుస్తున్న జడ్పీ చైర్ పర్సన్
బుధవారం రోజుఅసెంబ్లీ శాసనసభ సమావేశాల సాక్షిగా 91 వేల 142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం  హర్షించదగ్గ విషయమన్నారు.ఉద్యోగాలు  భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి  బుద్ధి తెచ్చుకొని,  కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన బిజెపి ప్రభుత్వం, నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు. .బీజెపి అధికారంలోకి రాగానే ఏటా 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్న మోదీ  7సంవత్సరాల కాలంలో కనీసం కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయ్యలేక పోవడం, దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు ,నియామకాల, నినాదంతో, ముందుకు సాగింది. కలలుగన్న తెలంగాణ  రాష్ట్రంలో నీళ్లు ,నిధులు ,ఈ విషయంలో ప్రగతి సాధించామం అన్నారు. ఇప్పుడు నియామకాల విషయంలో పెద్ద ఎత్తున 91 వేయి 142 పోస్టుల భర్తీకి మరియు 95% స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల  ముఖ్యమంత్రి కేసీఆర్ కి విద్యార్థులు యువకులు పక్షాన ప్రత్యేక  కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జడ్పీ చైర్ పర్సన్ వసంత.