రానున్నది ఉద్యోగుల సంవత్సరం మంత్రి కొప్పుల ఈశ్వర్.

యువత విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్.

రానున్నది ఉద్యోగులనామ సంవత్సరమని యువతకి బంగారు భవిష్యత్తును ఇచ్చే శుభకృత్వ సంవత్సరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ డెస్క్ )బుధవారం రోజు తెలంగాణ రాష్ట్రఅసెంబ్లీ  సమావేశాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, 80 వేల 39 పోస్టుల భర్తీకి కి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించడంపై ,మంత్రి కొప్పుల ఈశ్వర్  మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ నోటిఫికేషన్ గుర్తిండిపోతుంది అన్నారు.
అదేవిధంగా  11,039 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేయడం, 89,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు, భావితరాలకు అద్భుతంగా ఉండబోతోందన్నారు, నీళ్ళు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ లో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇప్పుడు మరో 92 వేల పోస్టుల భర్తీ అవుతున్నాయన్నారు .తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం చేయడం గొప్ప విషయం అన్నారు.  యువత విద్యార్థులు ఉద్యోగాల కోసం కష్టపడి చదవాలన్నారు.   ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి తెలంగాణ యువత, విద్యార్థుల పక్షాన కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.