అగ్నిధారన్యూస్ (  పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లాలో2015,  2018 సంవత్సరాల నుండి పని చేయుచున్న 40 మంది ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తమ యొక్క నెలసరి జీతం పెంపుదల చేయాలని, సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మండలం ఈ పంచాయతీ  ఆపరేటర్ ప్రశాంత్ మాట్లాడుతూ, మండల, గ్రామ, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా, గత కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ,పని చేస్తున్నామన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ని కలిసి  తమ వేతనాలు పెంపు విషయమై,  కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఈ- పంచాయతీ ఆపరేటర్లు పాల్గొన్నారు..