అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి క్రైమ్ ) పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామ సమీపంలో రాత్రి 12,30 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మధ్యప్రదేశ్ కు చెందిన శుభమ్ పీఎల్(25) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బసంత్ నగర్ ఎస్ ఐ మహేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం అందుగులపల్లిగ్రామ సమీపంలో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ట్రక్కు టైర్లను క్లీనర్ చెక్ చేస్తున్న క్రమంలో, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా, దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు అన్నారు . . బసంత్ నగర్ ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
