అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ):ఆదివారం రోజు గాంధీ భవన్లో దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్బంగా, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పాల్గొని, ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీకి తను చేసిన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేశ్ కుమార్ గౌడ్, RGPRS రాష్ట్ర చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్, పటేల్ రమేశ్ రెడ్డి, డా,, రవిబాబు, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
