శ్రీనివాస్ అగ్నిధార ( కామారెడ్డి జిల్లా ) ఉమ్మడి జిల్లాలో బైక్ ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది దొంగలు జల్సాల కోసం బైక్ల చోరీలకు పాల్పడుతు వాటిని ఇతర జిల్లాలలో అమ్మకాలు జరుపుతున్నారు. వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ కాలం గడుపుతున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరగా సమాజంలో తిరుగుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో దుకాణాల సముదాయం పెట్టిన బైకులను చోరీలకు పాల్పడుతున్నారు. ఒక్క బాన్సువాడ పట్టణంలో గతనెల రోజుల్లో 6 బైకులు దొంగలు తీసుకొని పారిపోగా ఇప్పటివరకు 4 బైకులను పోలీసులు స్వాధీనపరచు గా,ఒకటి అడవిలో దొరికింది. మరొకటి ఇప్పటివరకు చిక్కలేదు. రాత్రి వేళలో ఇంటి ముందున్న బైక్ ను సైతం దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఆకతాయిలు జల్సాలకు అలవాటుపడి . బైకుల చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు అందిన సమాచారం. ఈ ప్రాంతంలోని దొంగలించిన బైకులు, ఇతర జిల్లాలో కొంతమంది
బైక్ మెకానిక్ లకు ఎంతో కొంత ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బైక్ మెకానిక్ దుకాణాలకు చేరిన వెంటనే దొంగలించుకొని వచ్చిన బైకులు ఎక్కడికక్కడ పార్ట్స్ విడదీసి వేరే బైకులకు వాడుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది బైక్ చోరీలు మహారాష్ట్ర కి తీసుకెళ్లి నాందేడ్, ముఖేడ్ ప్రాంతాల్లో బైక్ ల అమ్మకాలు జరుపుతున్నారు. అక్కడినుంచి దొంగలించిన బైకులను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కొంతమంది బైక్ మెకానిక్ లకు అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. బైక్ మెకానిక్ లు వీటిని విడిభాగాలుగా చేసి వేరే వ్యక్తుల బైక్లకు అమర్చి డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోలీస్ యంత్రాంగం బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలు పట్టుకొని పదుల సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, బైక్ ల చోరీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఒక దుకాణం వద్ద పెట్టిన ద్విచక్ర వాహనం దొంగలు, దొంగలించు కొని పారిపోయారు, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాహనదారులు ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ముఖ్యంగా పోలీసులు ఇలాంటి వారి పైన నిఘా పెట్టి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
………………………………………………………………..

బైక్ దొంగతనాలను అరికడతాం: సీ.ఐ రాజశేఖర్ రెడ్డి ( బాన్సువాడ)
దొంగతనాలను అరికట్టడానికి బాన్సువాడ టౌన్ పరిధిలో దాదాపు 240 సిసి కెమెరాలను పర్యవేక్షణలో ఉంచామని, దీంతోపాటు మూడు స్పెషల్ టీములు ప్రత్యేక నిఘా పెడుతున్నయని అన్నారు. సరిహద్దు ప్రాంతం దగ్గర కావడంతో ఏదైన సమస్య ఉన్నా మహారాష్ట్ర పోలీసుల సహకారంతో అలాంటివి జరగకుండా చూస్తామని అగ్నిధార ప్రతినిధికి తెలిపారు.
