నంబర్ ప్లేట్లు లేని 45 వాహనాలు సీజ్:పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి….

తరచూ  వాహన తనిఖీలు ఉంటాయి.ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలి.

అగ్నిధారన్యూస్ (  పెద్దపల్లి  ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బుధవారం సాయంత్రం పట్టణంలో పలు కూడళ్లలో పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి ఆధ్వర్యంలో, స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఏసిపి సారంగపాణి మాట్లాడుతూ…. నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ఇకపై తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని ,నంబర్ ప్లేట్ లేకున్నా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా ,వాహనాలను సీజ్ చేస్తామని రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు…ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, రాజ వర్ధన్,వెంకట కృష్ణ, సహదేవ్ సింగ్, మౌనిక, శివాని, అశ్వినితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.