అగ్నిధారన్యూస్(  పెద్దపల్లిజిల్లా ) బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా ,ధర్మారం మండలం నంది మేడారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మధ్యాహ్నం భోజనం సమయంలో, పాఠశాల ఆవరణలో గల ట్యాంక్ లోని కలుషిత నీరు తాగి దాదాపు 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు.వారిని మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,చికిత్స నిమిత్తం తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం  తెలుసుకున్న సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్  జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ని అసెంబ్లీ నుండి చరవాణిలో మాట్లాడి, విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితిని గురించి  అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులకు  మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డిఈఓ మాధవి ,హాస్పిటల్ కి వెళ్లి విద్యార్థుల్ని పరామర్శించి,  మెరుగైన వైద్యం అదేవిధంగా డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెప్పిన వివరణ ప్రకారం గత కొద్ది రోజులుగా వాటర్ ట్యాంక్ నిర్వహణ  లోపమే   ఈ ప్రమాదానికి కారణమని  అగ్నిధార దృష్టికి వచ్చినది. ఏదేమైనప్పటికీ విద్యార్థుల పరిస్థితి   మెరుగ్గానే ఉందని డి ఈ ఓ మాధవి వివరణ ఇచ్చారు.