అగ్నిధారన్యూస్( నస్పూర్ )
బుధవారం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద, గల సింగరేణి కార్మిక విగ్రహం వద్ద గోదావరిఖని, ఏ ఎల్ పి గని ప్రమాదంలో, మరణించిన కార్మికుల ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టి నివాళులర్పించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సింగరేణి కార్మికులకు రక్షణను సంక్షేమాన్ని పట్టించుకోకుండా, నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని,సింగరేణి కార్మిక బిడ్డల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్,డిమాండ్ చేశారు.
