అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు… పెద్దపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్ ఉన్ నభి వేడుకలు జరిపారు. పట్టణంలో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో  చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ర్యాలీలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగరోజు ముస్లిం సోదరుల కుటుంబాలలో గొప్ప వెలుగు తేవాలని అన్నారు .ప్రతి ఒక్కరు సు:ఖ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.