అగ్నిధార న్యూస్, మంథని :ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సెంటినరీకాలనీ బ్రాంచ్‌ నుండి మంథని బ్రాంచ్‌కు పదోన్నతి, బదిలీపై వచ్చిన దుమ్మని లక్ష్మణ్‌ గారిని సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాలకవర్గ సభ్యులు సోమవారం మంథనిలోని బ్యాంక్‌లో శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ముత్తారం సహకార సంఘం సిఈఓ స్థాయి నుంచి కెడిసిసి బ్యాంక్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా, ఆ తదుపరి మంథని బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ నుంచి సెంటినరీకాలనీ బ్రాంచ్‌కు ఇన్‌చార్జీ మేనేజర్‌గా వెళ్లారని, అనంతరం పదోన్నతిపై మంథనికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మేనేజర్‌ లక్ష్మణ్‌భవిష్యత్‌లో మరిన్ని పదవులు అధిష్టించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మంథని ప్రాంతంలోని సన్న,చిన్నకారు రైతులందరికి ఋణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఈ సందర్భంగా కోరారు. బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాపరిధిలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు .ఇంత ఘనంగా స్వాగతం పలికిన మంథని సహకార సంఘం పాలక వర్గానికి ఉద్యోగస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు శ్రీ బెల్లంకొండ ప్రకాష్‌ రెడ్డి గారు, డైరెక్టర్లు శ్రీ మాచీడి రాజుగౌడ్‌ గారు, శ్రీ లెక్కల కిషన్‌ రెడ్డి గారు, సమ్మయ్య గౌతమేశ్వర దేవస్థాన చైర్మన్‌ శ్రీ మేడగోని రాజమౌళి గౌడ్‌ గారు, సంఘ ముఖ్యకార్యనిర్వహణాధికారి మామిడాల అశోక్‌కుమార్‌ సంఘ సిబ్బంది, తదితరులు పాల్గన్నారు.