■  బ్యాంకులో నగదు, ఆభరణాల భద్రత పై నమ్మకం,భరోసా కల్పించాలి

■  అప్రమత్తతే ఆయుధం, నిఘా నేత్రాలు ఏర్పాటు తప్పనిసరి

■  నైట్ సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్( పెద్దపెల్లి జిల్లా )పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలోమంగళవారం రోజు పెద్దపల్లి ఏ సీ పీ సాధుల సారంగపాణి ఆధ్వర్యంలో, సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో బ్యాంక్ మేనేజర్ తో బ్యాంకు భద్రత పై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ….బ్యాంకుల పట్ల భద్రత గురించి ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు బ్యాంకు వారు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.బ్యాంకు లోపల, బయట, పరిసరాల విజబుల్ విధంగా.. సీసీ కెమెరాలు తప్పక అమర్చుకోవాలని వీటికి మూడు నెలల బ్యాక్ అప్ ఉండాలి అన్నారు. రాత్రి పూట నాణ్యమైన దృశ్యాలను చిత్రీకరించే నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలి అన్నారు. సెన్సర్‌తో కూడిన అలారమ్ సిస్టమ్‌ను అమర్చుకోవాలి, వాటి పనితీరుపై ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు.ప్రతి బ్యాంక్, ఎటిఎం వద్ద రెండు షిప్టులలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు.సెక్యూరిటీ గార్డులు  నిరంతరం అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు, పోలీసులను సమాచారం అందించాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సెక్యూరిటీ గార్డులు శిక్షణ పొంది ఉండాలన్నారు.
బ్యాంకు ఓపెన్ సమయంలో మరియు బ్యాంకు వేళలు ముగిసిన తరువాత అనుమానిత వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగినట్లు కనబడిన, ఏదైనా సమస్య ఉత్పన్నమైన, అత్యవసర సమయాల్లో పోలీసు శాఖ వారికి సమాచారం అందిస్తే సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.నగదు, బంగారు ఆభరణాలు బ్యాంక్‌లో భద్రపరిచినప్పుడు వాటికి ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంపై రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొన్ని మార్గదర్శకాలను సూచించిందన్నారు. ఆర్‌బిఐ మార్గదర్శకాలను పాటించాలని అన్నారు.అదేవిధంగా సెక్యూరిటీ అలారం చెక్ చేయాలనీ అలారం ఏదైనా సమస్య ఉంటే వెంటనే దానిని సరి చూడాలన్నారు.
సెక్యూరిటీ గార్డు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకు లోపల స్ట్రాంగ్ రూమూలలో తరుచు చెక్ చేస్తూ ఉండాలి అన్నారు. ప్రజలు ఎంతో కష్టపడి వారు సంపాదించిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు నమ్మకంతో బ్యాంకులలో దాచుకోవడం జరుగుతుంది అన్నారు. వారి నమ్మకాన్ని కాపాడవలసిన బాధ్యత బ్యాంకు అధికారులపైన మరియు పోలిసుల పైన ఉన్నది అన్నారు. సమన్వయంతో పని చేస్తూ ప్రజల నమ్మకాన్ని పొందేలాగా పని చేయాలని బ్యాంకు మేనేజర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలోసుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.