అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :

లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమర్ చంద్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి పెద్దపల్లి మండలం నుండే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 200 మంది పైగా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్య బృందం గుర్తించింది. వీరికి లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్టు కంటి ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది పరీక్షలు నిర్వహించగా 50 మందికి కంటికి సంబందించిన కేటరాక్ట్ ఆపరేషన్ అవసరం ఉందని గుర్తించారు. వీరిలో మొదటి విడతగా 25 మందిని లయన్స్ ఆసుపత్రి వాహనంలో రేకుర్తి ఆసుపత్రికి తరలించి నేడు రక్త పరీక్షలు నిర్వహించి రేపు అపరేషన్ లు చేయనున్నట్టు లయన్స్ క్లబ్ ప్రతినిదులు తెలిపారు. అనంతరం వీరిని తిరిగి వారి వాహనంలో పెద్దపల్లి లో వదిలిపెట్టనున్నట్టు వారు తెలిపారు. రెండవ విడతలో మిగిలిన 25 మందికి ఆపరేషన్ చేపించనున్నట్టు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు Ln సయ్యద్ వజహాతుల్లా ఆయాజ్ తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం లో ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత భోజనము, వసతి, మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో రేకుర్తి ఆసుపత్రి డాక్టర్స్ స్వామి, సిబ్బంది, లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి సెక్రటరీ Ln శశాంక్, ట్రెజరర్ Ln వెంకటేశ్వర్లు, సీనియర్ సభ్యులు Ln కావేటి రాజగోపాల్, Ln జయపాల్ రెడ్డి, Ln ఎరబాటి వెంకటేశ్వర్ రావు, Ln బండ బాబురావు, Ln Dr బషీర్, Ln అశోక్ కుమార్, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు Ln నల్ల మనోహర్ రెడ్డి, పెద్దపల్లి లియో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.