
ధర్మాన్ని దారి తప్పించే
కుతూహల కుయుక్తులు
కాలధర్మం కర్మఫలమని
కఠినపాషాణ హృదయ నిర్ధయను
నింపుకున్న దృతరాష్ట్ర నిండుకుండ
తొణకని బెణకని దృష్ట ఆలోచనకు
ప్రతి రూపంగా ఫడిరవిల్లి
తనపర భేదాలు మరచి,
నిశ్చలమై నిలిచి ఉన్న పుణ్యభూమి
ధర్మ క్షేత్రమై విరాజిల్లే కురుక్షేత్రం..
పాపభయాహరణకు పాదుక
అవుతుందనే శంక వీడక,
కళ్ళు కనపడక పోయిన
కడుపు తీపి మాయాలోలమై
ఆత్మీయ పాండు పుత్రులను
వేరు చూసి, ఇంద్రియ నిగ్రహ,
నీతికోవిద, సకియయోగ్య,
హృదయ పారిపారిశుద్ధ్య పరుడైన
సంజయుడు తో యుద్ధమున
నా పుత్రులేమి చేసిరి అన్న ప్రశ్న
ఉద్భవించే…
గాయకవాడ ప్రసాద్
