■ బహుజన ఉగాది వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు.
■ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా ల బహుజన నాయకున్ని గెలిపించుకుందాం.
■ పార్టీలకతీతంగా బహుజనులు ఐక్యం కావాలిమాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు.
■ ఐక్యంగా ఉందాం అనుకున్నది సాధించాం బహుజన సంఘ నాయకుల పిలుపు.
◆ బహుజన నాయకత్వాన్ని బలపరుద్దాం రాజ్యాధికారాన్ని సాధిద్దాం.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రములోని జండాచౌరస్థ వద్ద నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీల బడుగు బలహీన వర్గాల వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒక్క చోట చేరి తమ ఐక్యతను చాటారు ………..పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా వద్ద పెద్దపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ L.రాజయ్య సూచనల మేరకు బొంకూరి. సురేందర్ సన్ని ఆధ్వర్యములో నిర్వహించిన శుభకృత్ నామ సంవత్సర బహుజన ఉగాది సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి మాజీ ఎం.ఎల్.ఏ బిరుదు రాజమల్లు హాజరై మాట్లాడుతూ….…… ప్రజలందరూ సుఖశాంతులతో, పడిపంటలతో ,కలకాలం వర్ధిల్లాలని అన్నారు.ఎక్కువ జనాభా కలిగిన మనమందరం అల్ప సంఖ్యకులను గెలిపిస్తే మనలను రాజకీయంగా అనగతొక్కుతున్నారు, కాబట్టి పార్టీలకు అతీతంగా బహుజన నాయకత్వాన్ని బలపరుచుకొని రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ గా బహుజనులనే గెలిపించుకుందామని……దీనికి SC,ST,BC,మైనారిటీ, ప్రజలందరూ, సన్నద్ధం కావాలని ప్రజలకి బిరుదు రాజమల్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈర్ల కొమురయ్య, వేముల రామ్మూర్తి,గంట రాములు, , గోపగాని సారయ్య గౌడ్,సయ్యద్ మస్రత్, సత్యనారాయణ రెడ్డి రాజం మహంత కృష్ణ, హనుమయ్య ప్రజా సంఘాల నాయకులు . శంకర్ ,రాజనరేందర్ గౌడ్, సురేందర్, బి.సి సంఘాల నాయకులు తాడూరి.శ్రీనివాస్,భూతగడ్డ సంపత్,సాబీర్ ఖాన్,సురేష్ గౌడ్, జగదీష్, శ్రీనివాస్,మంథని నర్సింగ్,తూముల సుభాష్ ,తూముల శ్రీనివాస్,ఫయాజ్,అరెపల్లి పున్నస్వామి,లక్ష్మీ నారాయణ,ట్యాంక్ జై దేవ్ లడ్డు,రమేష్ ,లెనిన్ గౌడ్, ,మొదుంపల్లి శ్రావణ్,చంద్రగిరి ఇమానియేల్,తదితరులు పాల్గొన్నారు.
