అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి )తుర్కల మద్దికుంట గ్రామంలో ప్రధాన కూడలి మార్కెట్ నిర్వహించే ప్రాంతం వద్ద బాటసారులకు చిరు వ్యాపారులకు దినసరి కూలీలకు మండుటెండల దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి  దాహం తీర్చే విధంగా రాబోయే రెండు నెలలు పాటు ఫ్రెండ్స్ ఫౌండేషన్ అద్వర్యం లో చలి వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
ఫౌండేషన్ ఛైర్మెన్ syed యసార్  మాట్లాడుతూ….. కులమతాలకు అతితంగా   ఇలాంటి కార్యక్రమాలను తమ ఫౌండేషన్ చేపడుతుందన్నారు మాకు తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంగేళ్ల జయప్రద (సంజీవరెడ్డి) వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య , ఉప సర్పంచ్ ఇదునూరి జాన్ , dr అబ్దుల్ ఖుద్దుస్ , వసీ,షకీల్ అహేమద్, మస్జిద్ కమిటి సదర్ Md తజోద్దీన్ , గ్రామ పాలకవర్గం. మస్జీద్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, dr వాసి,మరియ,సభ్యులు MD షారుఖ్, నేహల్, సయీద్ రెహ్మాన్, హసీబ్, తన్వీర్, మొక్తీయర్, ముషీర్ మోఖిమ్, MD బషీర్,SK బషీర్,పాల్గొన్నారు.