అగ్నిధార న్యూస్ కరీంనగర్:
హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ యం.పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ*బండి సంజయ్ గారు స్థానిక ఎంపీ, ఆనాడు దుబ్బాక లో జరిగింది ఉప ఎన్నికనే ఈరోజు హుజూరాబాద్ లో జరిగేది ఉప ఎన్నికనే. ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు దుబ్బాక ఎన్నికల్లో బండి సంజయ్ గారి ప్రచార తీరు ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం లో కనిపించడం లేదు.
ఈ ఉప ఎన్నికల్లో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఎంత బాధ్యత ఉందో ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది కానీ అంతా స్పష్టత కనిపించడం లేదు. ఈయన టిఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ టాగూర్ గారు చెబుతున్నట్లుగా టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లు ఏదైతే జరుగుతుందో అది ఆయన వ్యవహార శైలిలొ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
బండి సంజయ్ గారు చాలా వ్యవహారాల్లో మంత్రి గంగుల కమలాకర్ పై ఆరోపణలు చేశారు, ఈ మధ్యకాలంలో ఆ వ్యవహారాలు వెలుగులోకి వచ్చి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వారిపై చర్యలు తీసుకుంటే దానిపై ఎక్కడా కూడా స్పందించడం లేదు.
బండి సంజయ్ టిఆర్ఎస్ అవినీతి పైన మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కేవలం ఆరోపణ లకే పరిమితం అవుతున్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదు.
ఈ యొక్క కుట్రను, రెండు పార్టీల దోస్తానను ప్రజలు గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు పరచడానికి, ప్రశ్నించే గొంతుక గా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు బల్మూరి వెంకట్ గారిని గెలిపించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారితో పాటు టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి, మండల ఎలక్షన్ ఇన్చార్జి కోఆర్డినేటర్స్, మండల అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….
