అగ్నిధార న్యూస్, జగిత్యాల జిల్లా:

ఒకప్పుడు సినిమా పరిశ్రమ అంటే సామాన్యులకి కనిపించనంత సుదూరంలో కొండకోనల్లో వాగు వంకల్లో పెద్ద పెద్ద సెట్టింగ్ లు వేసి సినిమాలు తీసేవారు మరికొందరైతే  పేరుగాంచిన స్టూడియోలలోను ఇతర దేశాలకు వెళ్లి షూటింగ్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేవాళ్లు కాలం మారింది సినీ పరిశ్రమను ఈ మధ్యకాలంలో ప్రజల చెంతకు తీసుకురావాలని ఆలోచన ప్రతి నిర్మాత దర్శకుల లో  కనబడుతుంది అనడానికి నిదర్శనం వరంగల్ జిల్లా కొండ మురళి దంపతులపై బయోపిక్ కొండ పేరుతో సినిమా తీయడం అదేవిధంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామం లోని రైస్ మిల్ వద్ద మంగళవారం  సైదుల్ సినిమా షూటింగ్ నిర్వహించడం జరిగింది సినీ క్యారెక్టర్ అర్టిస్ట్ బెనర్జీ మరియు ఆర్టిస్టులు పాల్గొన్నారు. సినీ నటుడు బెనర్జీ ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.