అగ్నిధార న్యూస్ ( గోదావరిఖని:) శనివారం రోజు గోదావరిఖని  పట్టణంలోని  యాదవ సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమం  రామగుండం నగర యాదవ సంఘం అధ్యక్షులు  పాతపల్లి రవి కుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు…..

ఈ కార్యక్రమంలో  ముందుగా శ్రీ కృష్ణ భగవాన్ కి పూజా కార్యక్రమం చేశారు వేద పండితులు రాఘవాచార్యులచే పంచాంగ శ్రవణం జరిపించారు. వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటాయో చెప్పడం జరిగింది. శుభకృత్ నామ సంవత్సరం అన్ని శుభాలే కలుగుతాయని పండితులు పేర్కొన్నారు అనంతరం ఉగాది పచ్చడి అందరికీ అందించారు ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో …..

పత్రికా రంగంలో విశిష్ట కృషి చేసిన, చేస్తున్న  యాదవ పాత్రికేయులకు ఘన సన్మానం చేశారు యాదవ సంఘం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న  యాదవ సంఘం నాయకులకు సన్మానం చేశారు .

ఈ కార్యక్రమంలో …సోమారపు అరుణ్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్”గుంపుల తిరుపతి యాదవ్’ గుంపుల ఓదెలు యాదవ్ , కొమ్మ గట్టయ్య యాదవ్ ,వడ్లూరి రవి కుమార్ యాదవ్, చుక్కల శ్రీనివాస్ యాదవ్, బోయిని మల్లేష్ యాదవ్, కొమ్మ చందు యాదవ్. బాస్ వేనా కొమురయ్య యాదవ్, మేకల పోచం యాదవ్, నాయిని ఓదెలు యాదవ్, రమ్య యాదవ్, గుంపుల లక్ష్మి యాదవ్, గుండు తిరుపతి యాదవ్, ఆర్ కే యాదవ్, ప్రతాప్ యాదవ్, మనోజ్ యాదవ్, మేకల శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో పత్రికా రంగంలో సేవలు అందించిన  సన్మాన గ్రహీతలు : దొర గండ్ల సాంబమూర్తి యాదవ్, గుండేటి సతీష్ యాదవ్, మామిడి కుమార్ యాదవ్, తిరుపతి యాదవ్, ఆవుల కృష్ణ యాదవ్, మామిడి సత్యం యాదవ్, రమేష్ యాదవ్, సాగర్ యాదవ్, మారం కొమురయ్య యాదవ్, పి కుమార్ యాదవ్ , ఆవుల రాజేష్ యాదవ్,సదన్ కుమార్ యాదవ్, పాల్గొన్నారు

గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో….

ఉపాధ్యక్షుడిగా నుచ్చు శ్రీనివాస్ యాదవ్, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ గా ఎన్నికైన చేలకల పద్మజ యాదవ్. నేషనల్ అవార్డు గ్రహీత యాదవ రాజ్ ఘనంగా సన్మానించారు. అధిక సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.