3. పశ్యైతాం పాండుపుతాణా మాచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ 

జ్ఞానజిజ్ఞాస లేనేలేదు,
విజ్ఞాన సముపార్జన అవసరేమేలేదు,
గోటితో పోవునది గొడ్డలి వరకు వచ్చాక..

ఆచార్యుడు ఆరాధ్యుడులా
కనిపించకపోయినా, చతురత
ప్రదర్శించి, కాలాకాల మహాకాల కలికాల
కలిపురుషుడి రాకకు బీజం పడినట్లు..

వ్యంగేమే అనుకోనా?
సంజ్ఞగా ఉహించనా?
సంకుచిత మనుకోనా?
అన్న ప్రశ్నలకు కాలమే
జవాబు అని తెలుసు! అందుకే..

11 అక్షౌహీనిల మహాసేనను కలిగుండి,
7 అక్షౌహీనిల చిన్నసేనకు సేనానియైన
దుష్టధ్యుమ్ణుడు, వ్యూహకారంగ
రచించబడియున్న పాండవసేన
మహా గొప్పదని గురువు
ద్రోణాచార్యుడికి గుర్తుచేయడంలో..

గురుశిష్యుల పాత వైరిషమ్యాలు
మరోమారు రగిలించి యుద్ధం
రక్తికట్టించడంలో భాగమా? లేక..

సుసంపన్న సంపదలు భోగభోగాది
విలాసాలు మందిమార్భలంతో
మత్తెక్కి మదించిన అహంకారం
దుస్సాహస వక్రభాష్యా వ్యవహార
పరిహాసమా ?

గాయకవాడ ప్రసాద్