7.అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥
ఉత్తమోత్తములలో
బ్రాహ్మణోత్తముడే
పరమోత్తముడని వేదాలు
ఘోషిస్తున్నా..
అన్ని దానాల్లోకి
విద్యాదానం
ఉత్కృష్టమైనదని
అందరికీ తెలిసినా..
బ్రాహ్మణుడు
యుద్ధభూమిలో అడుగిడకూడదన్న
నియమాన్ని నిర్లక్ష్యము చేసి..
సర్వసైన్యంలో ఒక భాగానికి
నాయకత్వం వహించే గురువుకే,
మన సైన్యంలోని మహారథుల
వివరాలు మనం మళ్లి వల్లేవేసుకోడం..
నాకు కాస్త ధైర్యాన్ని నూరిపోసి,
మీకు కాస్త గుర్తుకు తెచ్చిన వాడిని
అవుతానన్న దుర్యోధన పలుకుల్లో..
అసహనం కొట్టొచ్చినట్టు కనిపించిందా?
లేక..
ఉన్న సంశయం పోయిందా?
