అగ్నిధార న్యూస్ ,కరీంనగర్:హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం మామిడాలపల్లి,ఎలుబాక గ్రామాలలోని డా.BR.అంబేద్కర్ కాలనీ లో నిర్వహించిన దళిత ఆత్మీయ సభలో ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి , పాల్గొన్నారు విద్యార్థి సంఘ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించి నట్లయితే ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు పేదింటి బిడ్డ అయినా గెల్లు శ్రీనివాస్ ను ప్రజలందరూ అక్కున చేర్చుకుని  అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు నిత్యం ప్రజల్లో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం అనేక మార్లు జైలుకు వెళ్లి వచ్చిన గొప్ప ఉద్యమకారులు శ్రీనివాస్ అన్నారు .ఈ కార్యక్రమంలో  వెంకట వీరయ్య  మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ,క్లస్టర్ ఇంచార్జ్ PACS ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవ రెడ్డి, సర్పంచ్ లు సుజాత-కిషన్ రెడ్డి,కాంతా రెడ్డి, ఎంపీటీసీ లు రజిత-పుల్లారెడ్డి,కాసం వీరారెడ్డి, ఉప సర్పంచ్ లు సత్యనారాయణ రెడ్డి,దేవయ్య,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.