అగ్నిధార న్యూస్ ,కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం ఎలువాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గ TRS ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసము ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం పెద్దపల్లి నేతలు పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి ఓటు వేయాలని ఓటర్లను కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు తోడు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విద్యార్థి ఉద్యమ నాయకున్నీ ఎన్నుకోవాలని సూచించారు ఈసందర్భంగా మార్క్ లక్ష్మణ్ మాట్లాడుతు కారు గుర్తుకు ఓటు వేసి శ్రీనివాసుని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంతరెడ్డి TRS స్థానిక యువ నాయకులు పాల్గొన్నారు.
