అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన హక్కుల. మరియు భారత రాజ్యాంగం అవగాహన పోస్టర్ ను పెద్దపల్లి జిల్లాకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ కమాన్ పూర్ మండలం లోని  అధివరహ స్వామి దేవాలయంలో వన్ వరల్డ్ వన్ పీపుల్ ఆర్గనైజర్ రణవేని లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాండ్ల మోహన్ విడుదల చేసి మాట్లాడుతూ….. భారత రాజ్యాంగంలో భారత ప్రజల సంక్షేమం కోసం అనేకమైన విషయాలు పొందుపరిచి ఉన్నాయి అన్నారు. ప్రతి వ్యక్తి హక్కుల,బాధ్యతలను కూడా గుర్తు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగంలో  కల్పించిన ప్రతి హక్కును వినియోగించుకొని ముందుకు నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి. సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాల్యాల తిరుపతి. చెంద్ర మొగిలి.కల్వల శ్రీనివాస్. కొలిపాక లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.