అగ్నిధారన్యూస్ పెద్దపెల్లిజిల్లా పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి మండలం పెద్దకాల్వల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను వెనకనుండి బలంగా ఢీకొట్టడంతో. కారులో ఉన్న చైత్ర ముఖి ,హులాస్ రామ్ ,అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.
మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో వాహనం ఆగి ఉన్న డి సి ఎం ని వెనుక నుండి ఢీకొంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తరలించారు. పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
