★★★ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతులమీదిగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఎంపీపీ
బండారి స్రవంతి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీడీవో రాజు…….
.అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ దీన్ దయాల్ అవార్డు ప్రదానోచ్ఛవ కార్యక్రమమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా అవార్డుకి ఎంపికయినా ప్రజాప్రతినిదులకు అవార్డులు అందించారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండల ఎంపీపీ బండారి స్రవంతి, శ్రీనివాస్ అవార్డుకు ఎంపిక కాగా…..పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులమీదిగా జాతీయ దీన్ దయాల్ అవార్డును ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మండలల గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు అవార్డులు పొందినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఇదే ఉత్సాహంతో మండలాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలన్నారు.
కార్యక్రమానంతరం తెలంగాణ ఉద్యమకారుడు అయిన విద్యార్థి సంఘ నేత బండారు శ్రీనివాస్ పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి తో కలిసి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్సీ కవితలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.ఈ సందర్భంగా ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్ లను కేటీఆర్,కవితలు అభినందించారు. పెద్దపల్లి మండలాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.యువకులైన మీకు రానున్న రోజులలో మంచి భవిష్యత్తు ఉంటుందని అని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మండల అభివృద్ధి అధికారి రాజు పాల్గొన్నారు. అవార్డు పొందిన ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాసు లను మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు,ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య ప్రత్యేక అభినందించారు. పెద్దపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు శంకరయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్ అభినందించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పెద్దపల్లి ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్ ఎంపీడీవో రాజుల కు అవార్డు తీసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.
