■ పారిశ్రామికాభివృద్ది సంబంధిత అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్,లక్ష్మీనారాయణ.
■ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి.
■ అధికారులు బ్యాంక్ సిబ్బందిని అభినందించిన అదనపు కలెక్టర్.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందజెయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం జిల్లాలో పారిశ్రామికాభివృద్ది, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకం అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలలో ఉన్న పరిశ్రమ ప్రోత్సహక కమిటి ద్వారా జిల్లాలో ఏర్పాట చేయనున్న పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా జారీ చేయాల్సిన అనుమతులలో
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2021-22 సంవత్సరంలో 100% లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు సంబంధిత అధికారులను, బ్యాంకు సిబ్బందిని అదనపు కలెక్టర్ అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.
జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఔత్సాహికులు నెలకొల్పిన 8 సేవారంగ యూనిట్లకు రూ.20 లక్షల పెట్టుబడి రాయితీ ని అదనపు కలెక్టర్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సమ్మయ్య,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
