అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా ప్రజారోగ్యమె ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్రంలో చేపడుతున్న మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 17 కోట్ల 80 లక్షల తో వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం రోజు మధ్యాహ్నం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యం దృశ్య రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. కార్పోరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అన్నారు. ఈరోజు నుండి పెద్దపల్లి జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అధునూతనమైన భవనంలో అందుబాటులోకి రానున్నాయి అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ,స్థానిక సంస్థల కలెక్టర్ కుమార్ దీపక్ , దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ పుట్ట మధూకర్,  ఎమ్మెల్సీ ఎల్ రమణ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, మందల వాసుదేవ రెడ్డి, ప్రమోద్ కుమార్, రమాకాంత్ జిల్లా స్థాయి అధికారులు , ఎంపీపీలు ,జెడ్పీటీసీలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.