అగ్నిధారన్యూస్ జూలపల్లి గత కొన్ని ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్యను వడ్కపూర్ నుంచి కీచులాటపల్లి వెళ్లే దారిలో ఒర్రె పై కల్వర్టు బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని జెడ్ పి టి సి లక్ష్మణ్ ను సర్పంచ్ మహంకాళి తిరుపతి , వైస్ ఎంపీపీ మొగురం రమేష్ మరియు గ్రామస్తులు కోరగా.. స్పందించిన జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించారు. ఇందుకు సహకరించిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి వడ్కాపూర్ మరియు కీచులాటపల్లి ప్రజల పక్షాన జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహంకాళి తిరుపతి, వైస్ ఎంపీపీ మొగురం రమేష్, కూసుకుంట్ల రాంగోపాల్ రెడ్డి, రాజేశ్వరరావు, కృపాకర్ రావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కన్నం రమేష్, మండల యూత్ అధ్యక్షుడు జెట్టి సతీష్, శ్రీనివాస్ గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ రాములు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, వైస్ ఎంపీపీ మరియు గ్రామ పెద్దలు మన జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.

