అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
అక్టోబర్ 26న రుణమేళా:: లీడ్ బ్యాంక్ మేనేజర్ చేగోండ వెంకటేష్
పెద్దపల్లి అక్టోబర్ 20:- జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో ఈనెల 26వ తేదీన ఉదయం 10:30 గంటలకు రుణ మేళ ఏర్పాటుచేయనున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ చేగోండ వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు ఆధ్వర్యంలో వివిధ రకాల రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించి రుణాలు, గృహ, వాహన, పంట, ఎడ్యుకేషన్ రుణాలను అందించేందుకు రుణమేళా ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.